పదేళ్ల కష్టార్జితంతో కారు కొన్న యువకుడు.. ఆనంద్ మహీంద్రా అభినందనలు
- మహీంద్రా ఎక్స్ యూవీని సొంతం చేసుకున్న అశోక్ కుమార్
- మీ దీవెనలు కావాలంటూ ఆనంద్ మహీంద్రాకు విన్నపం
- మీరే మమ్మల్ని దీవించారన్న దిగ్గజ పారిశ్రామికవేత్త
పదేళ్ల పాటు సంపాదనను కూడబెట్టి ఆ మొత్తంతో ఓ యువకుడు కారు కొనుక్కోగా.. కంపెనీ అధినేత ధన్యవాదాలు చెప్పడం అతడికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కారు కొనుక్కోవాలన్నది యువతరం కోరిక. సి.అశోక్ కుమార్ అనే వ్యక్తి కూడా అందుకు మినహాయింపు కాదు. అందరిలా కాకుండా సంపాదించినది కారు కోసం దాచి పెడుతూ వచ్చాడు అతడు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మహీంద్రా ఎక్స్ యూవీ 700కు యజమానిగా మారాడు. తన కష్టార్జితంతో దీన్ని కొనుక్కున్నానంటూ అతడు తన మిత్రులతో విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
అంతేకాదు, కారుతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ‘మీ ఆశీస్సులు కావాలి సర్’ అంటూ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దీనికి ఆయన స్పందించిన తీరు నెటిజన్లను టచ్ చేసింది. ‘‘ధన్యవాదాలు. కానీ, మీరు మీ ఎంపిక (మహీంద్రా ఎక్స్ యూవీ 700) తో మమ్మల్ని దీవించారు. కష్టంతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. సంతోషంగా డ్రైవ్ చేసుకోండి’’ అని ఆనంద్ మహీంద్రా రిప్లయ్ ఇచ్చారు. కారు కొని కంపెనీని దీవించారంటూ ఆనంద్ మహీంద్రా వినయంతో చేసిన కామెంట్ చాలా మందిని మెప్పించింది.