స్కార్పియో-ఎన్ కొనే ముందు ఈ అంశాలను గమనించాలి!
- మైలేజీ హైవేలపై 12 కిలోమీటర్లే
- పట్టణాల్లో అయితే ఇంకా తక్కువ
- ఏడాదికిపైన వేచి చూస్తేనే వాహనం చేతికి
- బూట్ స్పేస్ కూడా తక్కువే
మహీంద్రా స్కార్పియో ఎస్ యూవీ అంటే కొందరు అమితంగా ఇష్టపడతారు. ప్రముఖుల కాన్వాయ్ లలో ఈ వాహనాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్కార్పియో సిరీస్ లో తీసుకొచ్చిన స్కార్పియో ఎన్ వాహనానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ లు ప్రారంభించిన గంట వ్యవధిలోనే లక్ష వాహనాలకు బుకింగ్ లు వచ్చాయంటే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. అయితే, దీని కొనుగోలుకు ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
మైలేజీ
డీజిల్ వెర్షన్ అయితే 12 కిలోమీటర్లు, పెట్రోల్ వెర్షన్ అయితే 11-12 కిలోమీటర్లు ఒక లీటర్ కు మైలేజీ వస్తుంది. ట్రాఫిక్ అవాంతరాల్లేని హైవేల మీద ఇచ్చే మైలేజీ వివరాలు ఇవి. పట్టణాల్లో అయితే ఇంకా తక్కువ మైలేజీ వస్తుంది.
వెయిటింగ్ పీరియడ్
ఈ వాహనం కొనేసుకుని వెంటనే రయ్ మంటూ డ్రైవ్ చేద్దామనుకుంటే మాత్రం నిరాశ చెందాల్సిందే! ఎందుకంటే దీని కోసం దీర్ఘకాలం పాటు ఆగక తప్పదు. డిమాండ్ ఎక్కువగా ఉండడం, అదే సమయంలో ఆటో విడిభాగాలు, చిప్ ల సరఫరా వైపు సమస్యలతో కోరుకున్న ప్రతి ఒక్కరికీ స్కార్పియో ఎన్ అందించేందుకు చాలా సమయమే పట్టేట్టు ఉంది. ఎందుకంటే మహీంద్రాకు చెందిన ఎక్స్ యూవీ 700 కోసం ఏడాది వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. కనుక దీని కోసం కూడా ఏడాదికిపైనే వేచి చూడాల్సి రావచ్చు.
బూట్ స్పేస్
ఈ వాహనం చూడ్డానికి పెద్దగానే ఉంటుంది. కానీ, లోపల స్పేస్ విషయంలో అంత స్వేచ్ఛ ఉండదు. ఆరు లేదా ఏడు సీట్లు ఎంపిక చేసుకుంటే, అందరూ కూర్చున్న తర్వాత లగేజీకి మిగులు స్పేస్ ఉండదు. రూఫ్ క్యారియర్ ఒక్కటే ఆప్షన్. ముఖ్యంగా స్కార్పియో ఎన్ వాహనంలో మూడో వరుసలో తిరగడానికి అంత సౌకర్యంగా ఉండదు. ఇరుకుగానే ఉంటుంది.