దేశంలో 17 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 17,135 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,823
- 1,37,057కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఒక్కో రోజు కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నా, మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4.64 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... వీరిలో 17,135 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య దాదాపు 4 వేలు ఎక్కువ. ఇదే సమయంలో 19,823 మంది కోలుకోగా... 47 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,37,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.69 శాతంగా, క్రియాశీల రేటు 0.31 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,04,84,30,732 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొత్తం 9,47,49,391 మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారు. నిన్న ఒక్క రోజే 23.49 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 93.36 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారు.