తెలంగాణలో ఒక్కరోజులో 1000కి పైగా కరోనా కేసులు
- రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు
- 1,054 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 396 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 795 మంది
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదైంది. గడచిన 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు. ఇంకా 630 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
అదే సమయంలో 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,11,568 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,992 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.