ఈవిడే వైజయంతి... 'బింబిసార' నుంచి సంయుక్త మీనన్ స్పెషల్ టీజర్ రిలీజ్

  • కల్యాణ్ రామ్ ప్రధానపాత్రలో బింబిసార
  • కథానాయికలుగా కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్
  • పవర్ ఫుల్ పాత్రలో సంయుక్త మీనన్
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నూతన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన చిత్రం బింబిసార. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. కాగా, మలయాళ భామ సంయుక్త మీనన్ కు సంబంధించిన స్పెషల్ టీజర్ ను చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో సంయుక్త మీనన్ వైజయంతి అనే పవర్ ఫుల్ పాత్ర పోషించింది. 

కాగా, దర్శకుడు వశిష్ఠకు ఇదే తొలి చిత్రం. ఆయన టాలీవుడ్ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి కుమారుడు. తొలుత చెప్పిన రెండు కథలపై కల్యాణ్ రామ్ ఆసక్తి చూపకపోగా, మూడో కథతో ఆ నందమూరి హీరోను ఆకట్టుకున్నాడు. అందుకే కొత్త దర్శకుడు అని కూడా చూడకుండా,కథపై నమ్మకంతో భారీ బడ్జెట్ ను కేటాయించారు.


More Telugu News