ఏపీ సీఎం జగన్ తో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నానీ భేటీ

  • తాడేపల్లి వచ్చిన టెక్ మహీంద్రా బృందం
  • క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన వైనం
  • గుర్నానీ, సీఎం జగన్ మధ్య కాసేపు చర్చ
దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన గుర్నానీ సీఎం జగన్ ను సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం సీఎం జగన్ కూడా మర్యాదపూర్వకంగా గుర్నానీని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ప్రతినిధులు సీఎం జగన్ తో ఫొటోలకు ఆసక్తి చూపారు. 

టెక్ మహీంద్రా ఎండీ గుర్నానీ గత మే నెలలో సీఎం జగన్ ను దావోస్ లో కలిశారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం జగన్ ఆ సమయంలో దావోస్ లో ఉన్నారు. అక్కడ సీఎం జగన్, గుర్నానీ మధ్య ఆసక్తికర రీతిలో చర్చలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులకు అనువైన విధానాలు అమలు చేస్తున్నామని, టెక్ మహీంద్రా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరారు. ఏపీలో పరిశ్రమలు, సంస్థలు స్థాపించేవారి కోసం సింగిల్ విండో అనుమతులు ఉన్నాయని తెలిపారు. 

దీనిపై గుర్నానీ సానుకూలంగా స్పందించారు. హైఎండ్ టెక్నాలజీపై ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి పనిచేసే ప్రణాళిక ఉందని వెల్లడించారు.


More Telugu News