పశ్చిమ బెంగాల్ మాజీమంత్రి పార్థా ఛటర్జీపై చెప్పు విసిరిన మహిళ

  • స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన ఈడీ
  • చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఆయనపై చెప్పు విసిరిన మహిళ
  • చెప్పు ఆయన తలకు తగిలి ఉంటే సంతోషించేదాన్నని వ్యాఖ్య
పార్థా ఛటర్జీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో రూ. 55 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఈ నేపథ్యంలో, ఆయనను మంత్రి పదవి నుంచి సీఎం మమతా బెనర్జీ తొలగించారు. మరోవైపు ఈరోజు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చికిత్స కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన ఆయనపై ఒక మహిళ చెప్పు విసిరింది. ఆమెను అంటాలా నివాసి సుభద్రగా గుర్తించారు. 


చెప్పు విసిరిన సందర్భంగా ఆమె పార్థ ఛటర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆయన దండుకున్నారని అన్నారు. తాను విసిరిన చెప్పు ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్నని చెప్పారు. కుంభకోణం బయట పడిన తర్వాత కూడా ఆయనకు ఖరీదైన సేవలను ఎందుకు  అందిస్తున్నారని ప్రశ్నించారు. ఆయకకు వీల్ ఛైర్ ఎందుకు ఇస్తున్నారని అడిగారు. ఆయన నడవలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News