లోక్ సభలో పచ్చి వంకాయను కొరికిన మహిళా ఎంపీ... వీడియో ఇదిగో
- ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ
- చర్చలో పాలుపంచుకున్న టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్
- వంట గ్యాస్ పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన లేడీ ఎంపీ
- పచ్చి కూరలే తినాల్సి వస్తోందని ఆవేదన
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దేశంలో పెరిగిన నిత్యావసరాలు సహా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలపై ఉభయసభల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై చర్చకు అధికార పక్షం అంగీకరించగా... సోమవారమే లోక్ సభలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన మహిళా ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ పచ్చి వంకాయను తన నోటితో కొరికారు. వంట గ్యాస్ ధరలను కేంద్రం వరుసబెట్టి పెంచుతున్న తీరును నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. సభకు వచ్చేటప్పుడే పచ్చి వంకాయను వెంట తెచ్చుకున్న ఆమె... దానిని తన ముందున్న టేబుల్‌పై పెట్టుకుని ధరల పెరుగుదలపై చర్చలో పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో దేశ ప్రజలు వంట చేసుకోవడం కష్టంగా మారిందని, పచ్చి కూరగాయలే తినాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ఆమె పచ్చి వంకాయను చేతిలోకి తీసుకుని నోటితో కొరికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.