శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా... అద్భుత అవకాశం ఇదిగో!
- ఆగస్టు 7న రాకెట్ ప్రయోగం
- ఉదయం 9.18 గంటలకు దూసుకెళ్లనున్న ఏఎస్ఎల్వీ-డీ1
- ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న ఇస్రో
- షార్ వెబ్ సైట్ లింకు ద్వారా రిజిస్ట్రేషన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 7న శ్రీహరికోట నుంచి ఏఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రయోగం ఉదయం 9.18 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా ఇస్రో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
శ్రీహరికోటలో జరిగే ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకునేవారికి అద్భుత అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను షార్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. అందుకోసం ఓ లింకును కూడా తన ప్రకటనలో పొందుపరిచింది. ఈ లింకు (https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp..) ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొంది.