'జిన్నా' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!
- 'జిన్నా'గా మంచు విష్ణు
- యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- అక్టోబర్ 5వ తేదీన విడుదల చేసే ఛాన్స్
హీరోగా .. నిర్మాతగా మంచు విష్ణు హిట్టు కొట్టి చాలాకాలమే అయింది. ఆయన తాజా చిత్రంగా 'జిన్నా' రూపొందుతోంది. ఇషాన్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో పాయల్ .. సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ చాలా తక్కువ. అయితే ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక హింట్ ఇచ్చాడు. దాదాపు ఈ సినిమా ఆ రోజునే వస్తుందని అనుకోవచ్చు. అదే రోజున నాగార్జున 'ది ఘోస్ట్' రిలీజ్ ఉన్న సంగతి తెలిసిందే.
సునీల్ .. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్టయినర్ జోనర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో విష్ణు ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.