పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి!... కేంద్రానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సూచన!
- ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ
- చర్చలో పాలుపంచుకున్న గల్లా జయదేవ్
- బియ్యం, పాల ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్
- ధరల నియంత్రణకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచన
ధరల పెరుగుదలపై సోమవారం లోక్ సభలో జరిగిన చర్చలో టీడీపీ యువ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో ధరల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పలు సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన కీలక సూచన చేశారు.
బియ్యం, గోధుమ పిండి, పెరుగు, లస్సీ తదితరాలపై గత నెల 18 నుంచి విధించిన జీఎస్టీని తక్షణమే ఎత్తివేయాలని గల్లా జయదేవ్ కోరారు. సోయాబీన్, ముడి సన్ ఫ్లవర్ దిగుమతులపై 20 లక్షల టన్నుల దాకా ఎలాంటి దిగుమతి సుంకాన్ని విధించరాదని కూడా ఆయన సూచించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీంను అమలు చేయడం ద్వారా ధరల నియంత్రణకు కృషి చేయాలని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ధరల నియంత్రణకు తాను చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు జయదేవ్ పేర్కొన్నారు.