ఢిల్లీలో రాస్ భవనాన్ని ప్రారంభించిన వెంకయ్యనాయుడు
- పద్మశ్రీ అవార్డీ మునిరత్నం నాయుడు ప్రారంభించిన రాస్
- ఢిల్లీలో నూతనంగా కార్యాలయాన్ని తెరచిన సంస్థ
- మునిరత్నం నాయుడు సేవలను కీర్తించిన వెంకయ్య
ఏపీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రీయ సేవా సమితి (రాస్) దేశ రాజధాని ఢిల్లీలో తన నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యాలయ భవన సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాస్ సేవలను కొనియాడారు.
40 ఏళ్లుగా రాస్ సేవలు అందిస్తోందన్న వెంకయ్య... మహిళా సాధికారత కోసం సంస్థ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రముఖ గాంధేయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం నాయుడు మార్గనిర్దేశకత్వంలో రాస్ సేవలు వేగంగా విస్తరించాయని ఆయన తెలిపారు. ఢిల్లీలోనూ తమ సంస్థ సేవలు అందించాలని ఆయన ఎంతో తపించారన్న వెంకయ్య... ఈ రోజు మునిరత్నం నాయుడు లేకపోవడం విచారకరమని తెలిపారు.