హర్ ఘర్ తిరంగాపై మహేశ్ బాబు ట్వీట్ ఇదిగో
- 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
- స్వాతంత్య్ర దినోత్సవాన అన్ని ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం పిలుపు
- హర్ ఘర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్రచారం
- గర్వంగా భావిద్దామంటూ మహేశ్ బాబు పిలుపు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 13 నుంచి 15 వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఆవిష్కరించాలంటూ కేంద్రం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హర్ ఘర్ తిరంగా పేరిట దేశవ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతోంది.
ఈ ప్రచారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా పాలుపంచుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. త్రివర్ణ పతాకం మన గర్వకారణమని పేర్కొన్న ఆయన త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేద్దామంటూ అందరం ప్రతిజ్ఞ చేద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా హ్యాష్ ట్యాగ్‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.