ఓ శుభవార్తతో ఈ మాసాన్ని ప్రారంభిద్దాం: కేటీఆర్
- చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన కేటీఆర్
- బీమా పథకం తెస్తున్నామని వెల్లడి
- ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం
- అదే రోజున బీమా పథకం అమలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ వారాన్ని/నెలను ఓ శుభవార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ సర్కారు చేనేత, మరమగ్గం కార్మికులందరికీ సరికొత్త బీమా సదుపాయాన్ని తీసుకువస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు. రైతు బీమా తరహాలోనే, చేనేత కార్మికులకు బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమం అని కేటీఆర్ వెల్లడించారు.