చికెన్ పాక్స్.. మంకీ పాక్స్.. రెండింటి మధ్య తేడాలేమిటి?
- చికెన్ పాక్స్ లో ముందుగా చర్మంపై దద్దుర్లు/పొక్కులు
- తర్వాత జ్వరం వస్తుందన్న వైద్య నిపుణులు
- మంకీ పాక్స్ అయితే జ్వరం, దగ్గు, తలనొప్పితో మొదలు
- తర్వాత దద్దుర్లు/పొక్కులు వస్తాయని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో మెల్లగా ఇండియాలోనూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూఏఈ నుంచి కేరళకు వచ్చిన యువకుడికి.. విదేశాల్లోనే మంకీ పాక్స్ సోకినా లక్షణాలు బయటికి కనిపించకపోవడంతో ఆసుపత్రిలో సాధారణ చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మృతి చెందడం ఆందోళనకరంగా మారింది.
చికెన్ పాక్స్ ను మంకీ పాక్స్ అనుకుని..
మంకీ పాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంది. ఇటీవల ఏపీలోని విజయవాడలో, తెలంగాణలోని హైదరాబాద్ లో ఇలాగే చికెన్ పాక్స్ సోకిన వారిని మంకీ పాక్స్ అనుమానంతో ఆసుపత్రులకు తరలించారు. పరీక్షల్లో చికెన్ పాక్స్ గా తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్మాల్ పాక్స్ ఇప్పటికే దాదాపు అంతమైపోగా.. చికెన్ పాక్స్ మాత్రం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చికెన్ పాక్స్, మంకీ పాక్స్ మధ్య తేడాలు ఎలా గమనించాలనే దానిపై వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
మంకీ పాక్స్ లో ముందు జ్వరం వచ్చి..
మంకీ పాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని.. సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు/పొక్కులు ఏర్పడతాయని మేదాంత ఆసుపత్రి డెర్మటాలజీ వైద్య నిపుణుడు రమణ్ జిత్ సింగ్ తెలిపారు. ఇవి కూడా ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయని వివరించారు. అదే చికెన్ పాక్స్ లో ముందుగానే చర్మంపై దద్దుర్లు/పొక్కులు కనిపిస్తాయని, తర్వాత జ్వరం మొదలవుతుందని తెలిపారు.
దద్దుర్లు, పొక్కులు పెద్దగా.. దురద లేకుండా..
‘‘చికెన్ పాక్స్ లో దద్దుర్లు/పొక్కులు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది. అదే మంకీ పాక్స్ అయితే దద్దుర్లు/పొక్కులు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు. చికెన్ పాక్స్ లో అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. మంకీ పాక్స్ లో మాత్రం అర చేతులు, పాదాలపైనా ఏర్పడుతాయి.
ఇక చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు/పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మంకీ పాక్స్ లో మాత్రం చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి.” అని ఫోర్టిస్ మెమెరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ సతీశ్ కౌల్ తెలిపారు. మంకీ పాక్స్ లో జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వివరించారు.
ఒక దాని నుంచి మరో దానికి ఇమ్యూనిటీ ఉండదు
‘‘మంకీ పాక్స్, చికెన్ పాక్స్ లకు కారణమయ్యే వైరస్ లు రెండూ వేర్వేరు. ఒకటి సోకి తగ్గినంత మాత్రాన మరో దాని నుంచి ఇమ్యూనిటీ ఉండే అవకాశం లేదు. చాలా మంది దీనిపై మమ్మల్ని అడుగుతున్నారు. రెండూ వేర్వేరు. అయితే గతంలో స్మాల్ పాక్స్ కు వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం మంకీ పాక్స్ లక్షణాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ..” అని ఢిల్లీలోని బీఎల్ కే మ్యాక్స్ ఆస్పత్రి వైద్యుడు రాజిందర్ కుమార్ సింఘాల్ తెలిపారు.
మరీ ఆందోళన వద్దు..
మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందవల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
వైద్యులను సంప్రదించాల్సిందే..
మంకీ పాక్స్ కు, చికెన్ పాక్స్ కు మధ్య తేడాలేమిటో తెలిసినా.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని మేదాంత ఆసుపత్రి డెర్మటాలజీ వైద్య నిపుణుడు రమణ్ జిత్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వానల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తోందని, దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.