మోదీ నేతృత్వంలో జ‌రిగే భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం... ఈ నెల 6న హ‌స్తిన‌కు టీడీపీ అధినేత‌

  • స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లవుతున్న నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌
  • 2023 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఉత్స‌వాలు
  • ఈ నెల 6న రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ఉత్స‌వాల స‌న్నాహక స‌మావేశం
  • మోదీ నేతృత్వంలో జ‌రిగే ఈ భేటీకి రావాలంటూ చంద్ర‌బాబుకు ఆహ్వానం
భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో జ‌ర‌గ‌నున్న ఓ కీల‌క భేటీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మేర‌కు ఈ నెల 6న చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ ఉత్స‌వాల‌ను వ‌చ్చే ఏడాది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఈ ఉత్స‌వాల‌పై ప్ర‌ధాని నేతృత్వంలో సన్నాహ‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం పంపింది. కేంద్రం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన చంద్ర‌బాబు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు.


More Telugu News