శరీరంలో కొవ్వును నియంత్రించే ఏడు ఆహార పదార్థాలు!
- బియ్యానికి బదులు క్వినోవాను తీసుకోవడం వల్ల లాభమంటున్న నిపుణులు
- గుడ్లు, కిడ్నీ బీన్స్ తోనూ కడుపు నిండిన భావన ఉంటుందని వెల్లడి
- పరిమిత స్థాయిలో కాఫీ, గ్రీన్ టీలతోనూ ఫలితం ఉంటుందని వివరణ
ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి ఓ వైపు.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మరోవైపు.. శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. బరువు పెరిగిపోతున్నారు. ఊబకాయం వస్తోంది. దాని వల్ల మెల్లగా మధుమేహం, గుండె జబ్బులు వంటివీ మొదలై ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గడంపై దృష్టి పెడుతున్నారు. పొద్దున, సాయంత్రం వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తున్నారు. డైటింగ్ చేస్తున్నారు. ఆహారం విషయంలో విపరీతమైన ఆందోళన చెందుతున్నారు. ఏం తినాలో, ఏం తినకూడదో అన్న గందరగోళంలో పడుతున్నారు. ఈ క్రమంలోనే అటు వ్యాయామం వంటివి చేస్తూ.. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వును నియంత్రించుకుంటూ, బరువు తగ్గొచ్చని.. ముఖ్యంగా ఏడు రకాల ఆహార పదార్థాలు దీనికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
1. క్వినోవా
బరువు తగ్గాలనుకునే వారు బియ్యానికి బదులుగా క్వినోవాను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. క్వినోవాలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందని, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అధిక ప్రోటీన్లు శరీరానికి శక్తిని ఇస్తాయని వివరిస్తున్నారు. అంతేగాకుండా ఇవి జీవక్రియలను మెరుగుపరుస్తాయని.. ఇది శరీరంలో కేలరీలు త్వరగా కరిగిపోవడానికి తోడ్పడతాయని పేర్కొంటున్నారు. ఇక శరీరానికి అత్యంత ఆవశ్యక పోషకాలైన విటమిన్ ఈ, ఐరన్, జింక్, సెలీనియం వంటివి క్వినోవాలో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. రాజ్మా, ఛోలే వంటి కర్రీలతో క్వినోవాను కలిపి తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
2. గుడ్లు
రోజూ గుడ్డు తింటే ఆరోగ్యం బాగుంటుందన్నది పాత మాటే. అంతేకాదు గుడ్లు శరీరం బరువు నియంత్రణలో ఉంచుకునేందుకూ తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్లు.. శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంతోపాటు కడుపు నిండిన భావన కలిగిస్తాయని వివరిస్తున్నారు. దీనివల్ల తరచూ ఏదో ఒకటి తినే అలవాటు తప్పుతుందని స్పష్టం చేస్తున్నారు. తక్కువ కేలరీలు ఉండే డైట్ ను అనుసరిస్తున్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తింటే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
3. గ్రీన్ టీ
కరోనా తర్వాతి పరిణామాల నేపథ్యంలో జనంలో గ్రీన్ టీపై అవగాహన బాగా పెరిగింది. అది రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతో చాలా మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు. అయితే గ్రీన్ టీ శరీరంలోని జీవ క్రియలను మెరుగుపరుస్తుందని.. కేలరీలు వేగంగా కరిగిపోయేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో కొవ్వు పదార్థాల చేరిక నియంత్రణలో ఉంటుందని వివరిస్తున్నారు.
4. కాఫీ
పొద్దున లేవగానే కాఫీ లేనిదే చాలా మందికి మనసున పట్టదు. కాఫీ వల్ల శరీరంలో జీవ క్రియల (మెటబాలిజం) రేటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు చేసే సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల.. కొవ్వు కరిగే వేగం రెండింతలు అవుతుందని స్పష్టం చేస్తున్నారు. కాఫీలోని కెఫీన్ వల్ల మంచి ఉత్సాహం నెలకొంటుందని.. శారీరకంగా మరింత కష్టించడానికి ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
5. ఆకులతో కూడిన కూరగాయలు
ఆకులతో కూడిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం కూడా శరీరంలో కొవ్వు శాతం నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూర, కేల్, లెట్యూస్, క్యాబేజీ వంటివి తీసుకోవాలని.. వాటిలో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు జీర్ణ శక్తిని పెంచుతాయని వివరిస్తున్నారు. ఇదే సమయంలో కొవ్వు కరిగే వేగాన్ని పెంచేందుకు తోడ్పడతాయని చెబుతున్నారు.
6. కొబ్బరి నూనె
కొబ్బరికి సంబంధించిన అన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి ఏదో ఒక రకంగా మేలు చేసేవేనని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరితోపాటు కొబ్బరి నీళ్లు, దానితో రూపొందించే చక్కెర, నూనె వంటి వన్నీ ప్రయోజనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. కొబ్బరి నూనె వాడటం వల్ల శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయని.. కడుపు నిండిన భావన ఉంటుందని పేర్కొంటున్నారు. నిజానికి కొబ్బరి నూనెలో కొవ్వు పదార్థాలు ఉంటాయని.. కానీ వ్యాయామం చేస్తూ, తగిన స్థాయిలో ఆహారంలో కొబ్బరినూనె తీసుకుంటే ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
7. రాజ్మా (కిడ్నీ బీన్స్)
శాఖాహారులకు సమృద్ధిగా ప్రోటీన్లు అందాలంటే.. రాజ్మా, ఇతర బీన్స్ ను ఆహారంలో చేర్చుకోవడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పే కిడ్నీ బీన్స్ లో ఫైబర్, క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని.. ఇవి కడుపు నిండిన భావన కలిగిస్తాయని అంటున్నారు. దీనితో ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వుల నిల్వలు తగ్గుతాయని వివరిస్తున్నారు. అదే సమయంలో కిడ్నీ బీన్స్ లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, అది కరిగించడం అన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం పైన చెప్పుకున్న ఆహార పదార్థాలు తీసుకున్నంత మాత్రన కొవ్వు నియంత్రణలో ఉండదని.. అధిక కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉంటూ ఇవి తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. అంతేగాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొందరిపై ఒకరకంగా, మరికొందరిపై ఇంకో రకంగా ప్రభావం చూపే అవకాశాలూ ఉంటాయని.. అందువల్ల వైద్యుల సలహా తీసుకుని ఆహారం తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.