దూసుకుపోతున్న 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్!

  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజకవర్గం'
  • అవినీతి రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని
  • ఆగస్టు 12వ తేదీన విడుదల  
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్ లో నితిన్ నిర్మించిన ఈ సినిమాకి, రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిన్నరాత్రి 'గుంటూరు'లో నిర్వహించారు. 

అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేదికపై నుంచి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాలో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉందనే విషయాన్ని చెప్పేసింది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 

 ఈ ట్రైలర్ 11 గంటల్లోనే 7 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టేసింది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఏ మార్క్ ను టచ్ చేస్తుందనేది చూడాలి. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కృతి శెట్టి - కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. ఇంద్రజ కనిపించనున్నారు.


More Telugu News