కామన్వెల్త్ గేమ్స్‌లో కొనసాగుతున్న భారత్ హవా.. వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగో పతకం
- కామన్వెల్త్‌లో కొనసాగుతున్న భారత లిఫ్టర్ల హవా
- 23 ఏళ్ల బింద్యారాణికి రజతం
- ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కొల్లగొట్టిన నైజీరియా లిఫ్టర్
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. రెండో రోజును నాలుగు పతకాలతో ముగించింది. నిన్న తొలుత సంకేత్ సర్గర్ రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించగా, ఆ తర్వాత గురురాజ్ పుజారి కాంస్య పతకం అందుకున్నాడు. అనంతరం మణిపూర్‌కు చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను స్వర్ణంతో మెరిసింది. చివర్లో 23 ఏళ్ల బింద్యారాణి రజత పతకం గెలుచుకుని భారత్ ఖాతాలో నాలుగో పతకాన్ని చేర్చింది.
55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకం సాధించింది. నైజీరియాకు చెందిన అదిజాత్ ఒలారినోయ్ పసిడి పతకం కొల్లగొట్టింది. బింద్యారాణి కంటే ఒక్క కేజీ ఎక్కువగా 203 కేజీలు ఎత్తిన అదిజాత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు కాంస్యం దక్కింది.