భాగ్య‌న‌గ‌రిలో స‌ర్కారీ ప్ర‌కృతి వైద్యశాల‌... రూ.6 కోట్ల‌తో ఏర్పాటు

  • 10 ఎక‌రాల్లో నేచ‌ర్ క్యూర్ హాస్పిట‌ల్‌
  • రూ.6 కోట్లు విడుద‌ల చేస్తూ హ‌రీశ్ రావు ఉత్త‌ర్వులు
  • ప‌నులు త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని ఆదేశం
కార్పొరేట్ జంగిల్‌గా మారిపోయిన హైద‌రాబాద్‌లో గ‌డ‌చిన కొన్నేళ్లుగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌చ్చ‌ద‌నం అల‌రారే న‌గ‌రంగా పేరుతెచ్చుకున్న హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లో ప్ర‌కృతి వైద్య శాల అందుబాటులోకి రానుంది. అది కూడా ప్ర‌భుత్వ రంగంలో. ఈ మేర‌కు తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు శ‌నివారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న ఈ ప్ర‌కృతి వైద్య శాల ఏకంగా 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.6 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నేచ‌ర్ క్యూర్‌గా పేరు పెట్ట‌నున్న ఈ వైద్య శాల నిర్మాణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని కూడా ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News