జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా ఎంపిక... ధావన్ కు మరోసారి కెప్టెన్సీ
- ఆగస్టు 18 నుంచి జింబాబ్వే టూర్
- యువకులతో కూడిన జట్టు ఎంపిక
- రోహిత్, పంత్, షమీ, బుమ్రాలకు విశ్రాంతి
- కోహ్లీకి విశ్రాంతి పొడిగింపు!
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో, జింబాబ్వే టూర్ కు వెళ్లే భారత జట్టును సెలెక్టర్లు నేడు ఎంపిక చేశారు. వెస్టిండీస్ టూర్ లో వన్డే జట్టును నడిపించిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, బుమ్రా, జడేజా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి కల్పించారు. మాజీ సారథి విరాట్ కోహ్లీకి విశ్రాంతిని పొడిగించినట్టు తెలుస్తోంది.
టీమిండియా సభ్యులు వీరే...
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
జింబాబ్వేతో సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆగస్టు 18న హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరగనుంది. రెండో వన్డే ఆగస్టు 20న, మూడో వన్డే ఆగస్టు 22న ఇదే మైదానంలో జరగనున్నాయి.