దేశంలో అశాంతికి కుట్ర... ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: అజిత్ దోవల్
- మతం పేరిట అశాంతికి కుట్ర అన్న ఎన్ఎస్ఏ
- ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అజిత్ దోవల్ ప్రకటన
- కుట్ర భగ్నానికి చర్యలు చేపట్టామని వెల్లడి
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శనివారం ఓ కీలక అంశంపై ప్రకటన చేశారు. దేశంలో అశాంతికి కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్న ఆయన... ఆ కుట్రను భగ్నం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
సాధారణంగా జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉన్న అధికారి నుంచి ఈ తరహాలో పెద్దగా ప్రకటనలేమీ వెలువడవు. జాతీయ భద్రతా సలహదారు నుంచి ఏ సమాచారమైనా ముందుగా ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ)కు చేరుతుంది. దానిపై పీఎంఓ గానీ, లేదంటే ఆయా అంశాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు గానీ ప్రకటనలు జారీ చేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా ఈ దఫా నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ దిశగా ఓ కీలక ప్రకటన చేయడం గమనార్హం.