పోల‌వ‌రం వ‌ల్ల తెలంగాణ‌కు ముప్పు... ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ

  • బ్యాక్ వాటర్ ప్ర‌భావంపై స్వ‌తంత్ర సంస్థ‌లో అధ్య‌య‌నం చేయించాల‌న్న ఈఎన్‌సీ
  • మున్నేరువాగు, కిన్నెర‌సాని న‌దుల ప‌రిస‌రాలు మునుగుతాయ‌ని ఆందోళ‌న‌
  • ర‌క్ష‌ణ క‌ట్ట‌డాలు నిర్మించి ముంపు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలని విన‌తి
ఏపీలో క‌డుతున్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల భ‌ద్రాచ‌లానికి పెను ముప్పు ఉంద‌ని తెలంగాణ ఇంజినీర్ ఇన్ ఛీప్ శ‌నివారం పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి లేఖ రాశారు. పోల‌వ‌రం బ్యాక్ వాటర్‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ఇప్ప‌టికే కేంద్రానికి ప‌లుమార్లు లేఖ‌లు రాశామ‌ని తెలిపిన ఈఎన్సీ... ఇప్ప‌టికైనా ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. బ్యాక్ వాట‌ర్ ప్రభావంపై స్వ‌తంత్ర సంస్థ‌తో అధ్య‌య‌నం చేయించాల‌ని కూడా ఆయ‌న కోరారు. 

పోల‌వరం ప్రాజెక్టు పూర్తయితే భ‌ద్రాచ‌లానికి బ్యాక్ వాట‌ర్ ముప్పు ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఈఎన్‌సీ... ఎఫ్ఆర్ఎల్ వ‌ద్ద నీరు నిల్వ‌ ఉంటే ముంపు మ‌రింత ఎక్కువ ఉంటుంద‌ని తెలిపారు. మున్నేరువాగు, కిన్నెర‌సాని న‌దుల ప‌రిస‌రాలు మునుగుతాయ‌ని పేర్కొన్నారు. ర‌క్ష‌ణ క‌ట్ట‌డాలు నిర్మించి ముంపు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలన్న ఈఎన్‌సీ.. బ్యాక్ వాట‌ర్ తో ఏర్ప‌డే ముంపును నివారించాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు ప‌క‌డ్బందీగా తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.


More Telugu News