ప్రపంచం అంతమయ్యే ముందు సెల్ఫీలు ఇలా ఉంటాయట.. కృత్రిమ మేధ సృష్టించిన భయానక దృశ్యాలివి!

  • మొత్తం తగలబడిపోతున్న బ్యాక్ గ్రౌండ్ తో చిత్రాలు అందించిన ఏఐ ప్రోగ్రామ్
  • మనుషుల రూపురేఖలు కూడా దారుణంగా మారిన స్థితి
  • ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన చిత్రాలు, వీడియో
  • భయం గొలిపేలా ఉన్నాయంటూ కొందరు, ఇక నిద్ర పట్టేదెలా అంటూ మరికొందరి కామెంట్లు
ఓ వైపు గ్లోబల్ వార్మింగ్.. మరోవైపు దేశాల మధ్య ఆధిపత్య పోరు, యుద్ధాల భయం.. ఇంకోవైపు కాలుష్యం..  యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా.. మెల్లగా భూమ్మీద పరిస్థితులు మనుషులు జీవించే పరిస్థితులు లేకుండా పోతాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా కృత్రిమ మేధతో చిత్రాలను సృష్టించే ప్రోగ్రామ్ కూడా ఇలాంటి భయానక భవిష్యత్తునే అంచనా వేసింది. భూమిపై మనుషుల చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించాలని అడిగితే.. భయం గొలిపే చిత్రాలను ఆవిష్కరించింది. ఆ చిత్రాలు, ఆ చిత్రాలతో కూడిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

కృత్రిమ మేధ ప్రోగ్రామ్ తో..
  • ప్రస్తుత పరిస్థితులను, ముందు ముందు ఎదురయ్యే అంశాలను బేరీజు వేసుకుంటూ పనిచేసే కంప్యూటర్ ప్రోగ్రాములే ‘కృత్రిమ మేధ (ఏఐ)’ అని చెప్పవచ్చు. ఇలాంటి ‘డీఏఎల్ఎల్–ఈ 2’ అనే ఓ ఏఐ ఇమేజ్ జనరేటర్ (చిత్రాలను సృష్టించే కృత్రిమ మేధ ప్రోగ్రామ్)తో కొందరు ఓ వినూత్న ప్రయోగం చేశారు.
  • ‘భూమిపై మనుషులు తీసుకునే చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో చూపించు..’ అని కోరారు. దీనికి అనుగుణంగా ప్రాసెస్ చేసిన చిత్రాలను ఆ ప్రోగ్రామ్ చూపించింది.
  • దాదాపుగా ప్రళయం వచ్చి అంతమైపోయే చివరిలో ఉన్న పరిస్థితులు ఆ చిత్రాల్లో కనిపించడం గమనార్హం.
  • మొదట టిక్ టాక్ లో ‘రోబో ఓవర్ లోడ్స్’ పేరిట ఉన్న అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది ఇంటర్నెట్, వివిధ సోషల్ మీడియా సైట్లలో వైరల్ గా మారింది.
  • ఈ చిత్రాలను, వీడియోను చూసిన నెటిజన్లు ‘భయంగా ఉందని కొందరు.. అప్పటికే మనం మరో గ్రహం మీదికి వెళ్లిపోయి ఉంటామని మరికొందరు.. వామ్మో ఇక నిద్ర పట్టినట్టేనని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


More Telugu News