స్పెయిన్ లో మంకీ పాక్స్ తో మరొకరి మృతి.. ఆఫ్రికా బయటా నమోదవుతున్న మరణాలు

  • స్పెయిన్ లో ఏకంగా 4,298 మందికి సోకిన మంకీ పాక్స్ వైరస్
  • ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న 120 మంది
  • బ్రెజిల్ లోనూ ఒకరు మంకీ పాక్స్ తో మరణించినట్టు ప్రకటన 
మంకీ పాక్స్ వైరస్ పుట్టిన ఆఫ్రికా ఖండం అవతల ఆ వైరస్ కారణంగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా యూరప్ లో మంకీ పాక్స్ వైరస్ ప్రతాపం చూపుతోంది. ఆఫ్రికా ఖండం అవతల మంకీ పాక్స్ కారణంగా తొలి మరణం స్పెయిన్ లో శుక్రవారమే నమోదైంది. ఆ మరునాడే అంటే శనివారం మరో వ్యక్తి మంకీ పాక్స్ కారణంగా చనిపోయారు. దీంతో యూరప్ దేశాల్లో కలకలం మొదలైంది. 

స్పెయిన్ లో భారీగా కేసులు
  • ప్రపంచంలోనే అత్యధికంగా స్పెయిన్ లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తమ దేశంలో 3,750 మంకీ పాక్స్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు స్పెయిన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • 120 మందికిపైగా ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని.. ఇందులో ఇద్దరు చనిపోయారని ప్రకటించింది. 
  • స్పెయిన్ ఆరోగ్య శాఖ అత్యవసర విభాగం గణాంకాల మేరకు.. మొత్తంగా స్పెయిన్ లో ఇప్పటివరకు 4,298 మంది మంకీ పాక్స్ వైరస్ బారిన పడ్డారు.
  • మరోవైపు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ కూడా తమ దేశంలో మంకీ పాక్స్ కారణంగా ఒకరు చనిపోయినట్టు ప్రకటించింది. 


More Telugu News