విద్యుత్ పంపిణీ సంస్థలకు పడిన బకాయిలను రాష్ట్రాలు చెల్లించాలి: ప్రధాని మోదీ

  • డిస్కంలకు భారీగా బకాయిలు
  • రూ.1.3 లక్షల కోట్ల మేర చెల్లింపులు జరగని వైనం
  • ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
  • విద్యుత్ రంగ సుస్థిరతకు రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి
విద్యుత్ పంపిణీ సంస్థలకు పడిన బకాయిలను రాష్ట్రాలు చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. బిల్లులను, బకాయిలను వెంటనే చెల్లించడం ద్వారా వినియోగదారుల డిమాండ్లను అందుకునే దిశగా విద్యుత్ రంగంలో స్థిరత్వానికి దోహదపడాలని పిలుపునిచ్చారు.  

కాగా, కేంద్ర విద్యుత్ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం డిస్కంలకు పడిన బకాయిల మొత్తం ఇప్పటికే రూ.1.3 లక్షల కోట్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలకు అనేక నెలలుగా భారీగా బకాయి పడడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని, ఈ భారం విద్యుత్ ఉత్పాదన సంస్థలపై పడుతున్న విషయం గుర్తించాలని అన్నారు.


More Telugu News