కోమటిరెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిల చర్చలు విఫలం
- బీజేపీలో చేరిక దిశగా రాజగోపాల్ రెడ్డి అడుగులు
- కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తానన్న కోమటిరెడ్డి
- మునుగోడు ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని వ్యాఖ్య
టీకాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనతో టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా ఈ ఉదయం ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు వేర్వేరుగా భేటీ అయ్యారు. అయితే వీరు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక ఖాయమని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ మార్పుకు నాంది అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. మరోవైపు, మీడియాతో మాట్లాడిన వెంటనే ఆయన చౌటుప్పల్ కు బయల్దేరి వెళ్లారు.