మ‌హారాష్ట్రలో 'బాయికాట్ తిరుప‌తి' ప్ర‌చారం... కార‌ణం జ‌గ‌నే: తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్

  • జ‌గ‌న్ తీరుతో తిరుప‌తికి, ఏపీకి చెడ్డ పేరన్న రాజాసింగ్‌
  • అలిపిరి వ‌ద్ద వాహ‌నాల‌పై హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాల‌ను తొల‌గిస్తున్నారని ఆరోపణ  
  • జ‌గ‌న్ ఏ దేవుడిని న‌మ్ముతారో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసున‌న్న తెలంగాణ ఎమ్మెల్యే
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు వ‌ల్ల తిరుప‌తితో పాటు మొత్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే చెడ్డ పేరు వ‌స్తోంద‌ని తెలంగాణ బీజేపీ నేత‌, హైద‌రాబాద్‌లోని గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రస్తుతం మ‌హారాష్ట్ర సోష‌ల్ మీడియాలో 'బాయికాట్ తిరుపతి' పేరిట జ‌రుగుతున్న ప్ర‌చారం వైర‌ల్‌గా మారిపోయింద‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ త‌ప్పుడు నిబంధన‌లే ఈ వివాదానికి కార‌ణ‌మ‌ని కూడా రాజాసింగ్ ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా శ‌నివారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ మ‌హారాష్ట్రలో 'బాయికాట్ తిరుప‌తి' పేరిట ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని అన్నారు. అలిపిరి వ‌ద్ద వాహ‌నాల‌పై హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాల‌ను తొల‌గిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్దారు. జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల తిరుపతికి చెడ్డ పేరు వ‌స్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. శివాజీ విగ్ర‌హాల‌ను అడ్డుకోవ‌డం మ‌హారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని ఆయ‌న గుర్తు చేశారు. జ‌గ‌న్ ఏ దేవుడిని న‌మ్ముతారో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసున‌న్న రాజాసింగ్‌.. జ‌గ‌న్ తీరుతో తిరుప‌తికి, ఏపీకి చెడ్డ పేరు వస్తోంద‌ని ఆరోపించారు.


More Telugu News