కిడ్నీ ఫెయిల్యూర్ అయి.. 'మహాభారత్' సీరియల్ నటుడు మృతి
- రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్న రసిక్ దవే
- 1982లో గుజరాతీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రసిక్
- ఆయన భార్య కేతకి కూడా పాప్యులర్ నటి
ప్రముఖ సినీ నటుడు రసిక్ దవే కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత రెండేళ్లుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
1980లలో ప్రసారమై, యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన 'మహాభారత్' సీరియల్ లో ఆయన నంద్ పాత్రను పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1982లో గుజరాతీ సినిమా 'పుత్ర వధు' ద్వారా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో గుజరాతీ సినిమాలు, టీవీ షోలలో నటించారు. 2006లో 'నాచ్ బలియే' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. కేతకి దవే అనే నటిని ఆయన పెళ్లి చేసుకున్నారు. గుజరాత్ లో ఆమె కూడా పాప్యులర్ నటి కావడం గమనార్హం. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.