సినిమాగా వస్తున్న మార్లిన్ మన్రో జీవితం.. ఆసక్తికరంగా ట్రైలర్
- ‘బ్లాండ్’ పేరిట వస్తున్న బయోపిక్
- ఒకప్పుడు హాలీవుడ్ ను ఏలిన అమెరికా నటి మన్రో
- హీరోయిన్, మోడల్, సింగర్ గా ఎంతో పేరు
- ఆమె మరణంపై ఇప్పటికీ అనుమానాలే
మార్లిన్ మన్రో.. సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కొన్నేళ్ల పాటు హాలీవుడ్ ను ఏలిన వ్యక్తి. హీరోయిన్, మోడల్, సింగర్ గా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందామె. ఆమె స్థాయి స్టార్ డమ్ ను హాలీవుడ్లో ఇప్పటిదాకా మరెవరూ అందుకోలేదని అనొచ్చు. హాలీవుడ్‌ను అంతలా శాసించిన మన్రో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ఆమె మరణం ఇప్పటికీ రహస్యమే. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చినా, అది హత్యే అనే అనుమానాలున్నాయి.
ఈ విషయంపై ఇప్పుడు కాస్త క్లారిటీ లభించే అవకాశం కనిపిస్తోంది. తెరపై వెలుగులు పంచిన మన్రో జీవితంలోని చీకటి, విషాదాలు అభిమానులకు తెలియనున్నాయి. ఎందుకంటే ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. ‘బ్లాండ్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పానిష్ నటి ఆనా డి అర్మాస్ మార్లిన్‌గా నటిస్తోంది. జాయిస్ క్యారల్ ఓట్స్ రాసిన నవల ఆధారంగా ఆండ్రూ డొమినిక్ దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇందులో మన్రో గ్లామర్‌నే కాకుండా ఆమె జీవితంలోని సంఘర్షణను కూడా చూపించే సన్నివేశాలున్నాయి. మన్రో జీవిత విశేషాల గురించి ఇంకా ఏం చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ట్రైలర్ విడుదలై రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. దీన్ని బట్టి మన్రో గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.