సిగరెట్, పొగాకు ఉత్పత్తులపై కొత్త 'హెచ్చరిక' ముద్రించాల్సిందే!
- పొగాకు ఉత్పత్తులపై డిసెంబర్ 1 నుంచి కొత్త హెచ్చరికలు
- పొగాకు బాధాకరమైన చావుకు కారణమవుతుందని ప్రచురించాల్సిందే
- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
సిగరెట్ పెట్టెలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరిక కనిపించబోతోంది. దేశీయంగా తయారు చేసే పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునేవి, లేదా ఇక్కడ ప్యాక్ చేసే పొగాకు ఉత్పత్తులపై డిసెంబర్ 1 నుంచి నూతన ఇమేజ్ తో కూడిన హెచ్చరికను ముద్రించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
‘‘ఎంతో బాధతో కూడిన చావుకు పొగాకు కారణమవుతుంది’’ అనే హెచ్చరికతో ప్యాక్ లపై ఫొటోతోపాటు హెచ్చరిక ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ హెచ్చరిక ఏడాది పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది.
ఇక 2023 డిసెంబర్ 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై (సిగరెట్, గుట్కా తదితర) ‘‘పొగాకు వినియోగంతో చిన్న వయసులోనే చనిపోతారు’’ అనే హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త హెచ్చరికలను ఆరోగ్య శాఖ నోటిఫై చేసింది. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.