అటు బింబిసారుడు .. ఇటు సీతారాముడు

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • ప్రత్యేకమైన జోనర్ ప్రధానమైన ఆకర్షణ 
  • ప్రేమకథాంశంతో పలకరించనున్న 'సీతా రామం'
  • ఈ కథ నడిచే కాలమే ప్రధానమైన బలం
జులై నెలలో వచ్చిన సినిమాలేవీ కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. వీకెండ్ లో కూడా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఇక అందరి దృష్టి ఇప్పుడు ఆగస్టుపైనే ఉంది. ఆగస్టు మొదటివారంలోనే .. అంటే 5వ తేదీన 'బింబిసార' .. 'సీతారామం' సినిమాలు థియేటర్లలోకి దిగిపోతున్నాయి.

కల్యాణ్ రామ్ ఈ సారి చారిత్రక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ ను జోడించి, ఒక కొత్త జోనర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రెండు కాలాల్లో నడిచే ఈ కథలో .. రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఈ జోనర్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత బజ్ పెరిగినట్టే అనిపిస్తోంది.  

ఇక దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' విషయానికి వస్తే ఇది ఒక అందమైన ప్రేమకథ. కథలో కొంత భాగం 1960లలో జరుగుతుంది. కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటించగా, కీలకమైన పాత్రలో రష్మిక కనిపించనుంది. వేరు వేరు కాలాల్లో జరిగే కథలు  .. వేరు వేరు జోనర్స్ లో వస్తున్న సినిమాలు ఇవి. మరి ఈ రెండింటిలో ఏ సినిమా ఎక్కువ వసూళ్లను రాబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News