నా అంతిమ లక్ష్యం పారిస్ ఒలింపిక్స్: పీవీ సింధు
- తన దృష్టి మొత్తం కామన్వెల్త్ క్రీడలపైనే ఉందన్న తెలుగు తేజం
- ఈ క్రీడల్లో స్వర్ణం సాధిస్తానంటున్న సింధు
- నేర్చుకోవడమే తన విజయ రహస్యమన్న భారత షట్లర్
తన అంతిమ లక్ష్యం 2024 పారిస్ ఒలింపిక్స్ అని రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు స్పష్టం చేసింది. ప్రస్తుతం బర్మింహామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కామన్వెల్త్ గేమ్స్ సరైన వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
‘నా అంతిమ లక్ష్యం 2024లో పారిస్ ఒలింపిక్స్. ప్రస్తుతానికైతే నా దృష్టి అంతా కామన్వెల్త్ పతకం, ఆపై ప్రపంచ పియన్‌షిప్‌లపైనే ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో గెలవడం ఒక పెద్ద ఘనత అవుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఈవెంట్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణం. ఈసారి స్వర్ణం సాధిస్తానన్న ఆశతో ఉన్నా’ అని సింధు చెప్పుకొచ్చింది. భారత బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగిన సింధు ఎల్లప్పుడూ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడమే తన విజయ రహస్యమని పేర్కొంది.