బీజేపీవైపు పన్నీర్‌సెల్వం చూపు.. త్వరలోనే కాషాయపార్టీలోకి?
- మోదీ, అమిత్‌షా ఫొటోలతో భారీ హోర్డింగ్ ఏర్పాటు
- చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కోసం మోదీ చెన్నై వచ్చిన రోజే హోర్డింగ్
- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు
అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బీజేపీ వైపు చూస్తున్నారా? త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంచీపురంలో పన్నీర్‌సెల్వం వర్గం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లో ఓ వైపు మోదీ, మరోవైపు అమిత్ షా ఫొటోలు ఉండడమే ఈ ఊహాగానాలకు కారణం.
ఈ హోర్డింగ్‌పై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో చేరేందుకు సన్నాహకాల్లో భాగంగానే ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారని కొందరు చెబుతుంటే, బీజేపీని మచ్చిక చేసుకుని అన్నాడీఎంకేలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.
చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కోసం మోదీ చెన్నైకి వచ్చిన రోజే ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. అన్నాడీఎంకేలో నెలకొన్న నాయకత్వ పోరులో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిది పై చేయి కావడం, పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా ఎదురుదెబ్బ తగలడంతోనే పన్నీర్‌సెల్వం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.