హైదరాబాదులో మరోసారి భారీ వర్షం
- గంటసేపు నగరంలో జడివాన
- ఈదురుగాలులతో కూడిన వర్షం
- దిల్ సుఖ్ నగర్ పరిసరాల్లో అధిక వర్షపాతం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయన్న జీహెచ్ఎంసీ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఇటీవలి వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంట సేపు నగరంలో జడివాన కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. న్యూబోయిన్ పల్లిలో చెరువుకట్ట తెగిపోవడంతో వరదనీరు భారీగా వచ్చిపడింది.
మలక్ పేట, నాగోల్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా, నీరు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్ హోల్స్ తెరిచినందున ప్రజలు అప్రమ్తమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.