గాడ్ ఫాదర్ కోసం... సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్టెప్పులు

  • చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
  • మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
  • కీలకపాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
  • ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ పై పాట
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై వచ్చే ఓ గీతాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. 

దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భాయ్ తో (సల్మాన్ ఖాన్) కాలు కదిపానని, ప్రభుదేవా అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చాడని చిరంజీవి పేర్కొన్నారు. ఈ పాట కచ్చితంగా కన్నులపండుగలా ఉంటుందని హామీ ఇచ్చారు. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.


More Telugu News