ఏమి దొరా నీ వల్ల ఉపయోగం?: షర్మిల

  • మునిగిపోయే కాళేశ్వరంకు లక్షల కోట్లు అప్పు తెచ్చారన్న షర్మిల 
  • అన్నం పెట్టే రైతును ఆదుకోవడానికి పైసలు లేవా? అంటూ ప్రశ్న 
  • వరద బాధితులకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పి వారాలు గడుస్తోందని విమర్శ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. మునిగిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టొచ్చు కానీ, అన్నం పెట్టే రైతును ఆదుకోవడానికి పైసలు లేవా? అని ప్రశ్నించారు. వానలకు, వరదలకు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని... ఒక్క రైతునన్నా ఆదుకున్నావా కేసీఆర్? అని ప్రశ్నించారు. 

వరదలకు ఇళ్లు మునిగిపోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు సాయం చేశారా? అని ప్రశ్నించారు. రూ. 10 వేలు సాయం చేస్తామని చెప్పి వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పైసా అన్నా ఇచ్చావా? అని అడిగారు. పంటల బీమా చేయడం చేతకాదు, నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతకాదు, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం చేతకాదని విమర్శించారు. ఏమి దొరా నీ వల్ల ఉపయోగం? అని ఎద్దేవా చేశారు.


More Telugu News