విద్య అనేది గుళ్లో నైవేద్యంలాంటిది: 'సార్' సినిమా నుంచి టీజర్ రిలీజ్
- ధనుశ్ తెలుగు సినిమాగా 'సార్'
- తమిళ టైటిల్ గా 'వాతి'
- జూనియర్ లెక్చరర్ పాత్రలో ధనుశ్
- దర్శకత్వం వహిస్తున్న వెంకీ అట్లూరి
ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకి 'వాతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార .. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి నిన్ననే ధనుశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.
ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కథ 1990లలో మొదలవుతుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. విద్యా వ్యవస్థలోని రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో ఉండనుందనే విషయాన్ని టీజర్ తోనే చెప్పేశారు.
ఈ సినిమాలో ధనుశ్ జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు. "విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ .. పంచండి. ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ మాదిరిగా అమ్మకండి" అనే ధనుశ్ డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు సందేశం కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది.