తిరువన్నామలై ఆలయంలో ప్రత్యేక యాగం నిర్వహించిన జపాన్ దేశస్థులు... వీడియో ఇదిగో!
- హైందవ ఆధ్యాత్మికత పట్ల జపనీయుల ఆసక్తి
- తిరువన్నామలై క్షేత్రానికి రాక
- సంప్రదాయబద్ధంగా యాగంలో పాల్గొన్న వైనం
- వేదమంత్రాలు పఠించిన జపాన్ బృందం
హైందవ ఆధ్యాత్మికతకు నెలవైన భారతదేశం అనేకమంది విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమం అందులో ప్రముఖమైనది. అయితే, దేశంలోని ఇతర ఆలయాలకు కూడా విదేశీయులు రావడం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని తిరువన్నామలై పుణ్యక్షేత్రంలో జపాన్ దేశస్థులు సందడి చేశారు. వారు ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక క్రతువులు ఆచరించారు. ఓ యాగంలోనూ ఆ జపనీయులు పాలుపంచుకున్నారు.
ఈ యాగం సందర్భంగా వారు స్పష్టంగా వేదమంత్రోచ్చారణ చేయడం అందరినీ ఆకట్టుకుంది. జపాన్ మహిళలు భారత సంప్రదాయాల ప్రకారం చీరకట్టులో రాగా, పురుషులు కూడా స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణతో కనిపించారు. లోక కల్యాణార్థం వారు ఈ యాగం నిర్వహించినట్టు తెలుస్తోంది.