బలపడిన రూపాయి.. డాలర్ తో రూ.79.65 కు చేరిక!

  • బుధవారం నాటి నష్టం నుంచి కోలుకుని పెరిగిన రూపాయి
  • అంతర్జాతీయంగా డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్ల దూకుడు తోడ్పాటు
  • కొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో కొనసాగ వచ్చంటున్న నిపుణులు
డాలర్ తో మారకంలో రూపాయి కొంత బలపడింది. గురువారం 26 పైసలు పెరిగి రూ.79.65 పైసల వద్ద స్థిరపడింది. ఇటీవలి వరుస పతనం నేపథ్యంలో.. ఓ వైపు స్టాక్ మార్కెట్లు పెరగడం, రూపాయి తిరిగి బలపడటం గమనార్హం. బుధవారం డాలర్ తో రూపాయి మారకం 13 పైసలు తగ్గి రూ.79.91 పైసల వద్ద ముగియగా.. గురువారం ఉదయం రూ.79.80 పైసల వద్ద బలంగానే ట్రేడింగ్ మొదలైంది. రూ.79.64 పైసల వరకు పెరిగి చివరికి 26 పైసల లాభంతో రూ.79.65 పైసల వద్ద ముగిసింది.

మరికొన్ని రోజులూ ఇలాగే..
‘‘అంతర్జాతీయంగా డాలర్ బలహీనతకు తోడు దేశీయంగా స్టాక్ మార్కెట్లు దూసుకుపోవడంతో రూపాయి బలపడింది. చమురు ధలు పెరగడం వల్ల రూపాయి మరింత బలపడకుండా ఆగింది. కొన్ని రోజుల పాటు రూపాయి ఇదే స్థాయిలో కొనసాగవచ్చు..” అని వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేదీ వెల్లడించారు. 



More Telugu News