వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని చెప్పండి: అధికారులకు జగన్ ఆదేశాలు
- పంపు సెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయండి
- మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించండి
- పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేలా చూసుకోవాలి
పంపు సెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు లేఖలు రాయాలని అన్నారు.
ఇక థర్మల్ కేంద్రాల వద్ద తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేలా చూసుకోవాలని చెప్పారు. విద్యుత్ రంగంపై ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పై ఆదేశాలను జారీ చేశారు.