ఈడీ సోదాలపై చీకోటి ప్రవీణ్ స్పందన ఇదే
- సోమవారం ఈడీ విచారణకు హాజరవుతానన్న ప్రవీణ్
- ఈడీ ప్రశ్నలకు సమాధానం చెబుతానని వెల్లడి
- క్యాసినో ఇల్లీగల్ ఏమీ కాదని కామెంట్
- నేపాల్‌తో పాటు గోవాలోనూ క్యాసినో లీగలేనన్న చీకోటి
ప్రముఖుల కోసం దేశ, విదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తూ హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలపై తాజాగా స్పందించాడు. తన ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌజ్‌లలో ఈడీ సోదాలు జరిగిన మాట వాస్తవమేనని అతడు ఒప్పుకున్నాడు. సోదాల సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని కూడా చెప్పాడు.
సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ చీకోటి ప్రవీణ్‌తో పాటు అతడితో కలిసి ఈ వ్యవహారాలు నడిపిస్తున్న మాధవరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనా ప్రవీణ్ స్పందించాడు. సోమవారం ఈడీ విచారణకు హాజరవుతానని, ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అతడు తెలిపాడు. తానేమీ తప్పు చేయలేదని కూడా ప్రవీణ్ వ్యాఖ్యానించాడు. తాను నిర్వహిస్తున్న క్యాసినో ఇల్లీగలేమీ కాదని తెలిపాడు. నేపాల్‌తో పాటు మన దేశంలోని గోవాలో కూడా క్యాసినో లీగలేనని చెప్పాడు. తాను మనీ ల్యాండరింగ్ లాంటి నేరాలకు పాల్పడలేదని అతడు చెప్పాడు.