వరద బాధితులకు సాయం అందిస్తున్న సీతక్క.. వీడియో ఇదిగో
- వరద బాధితుల కోసం నిత్యావసరాలు సేకరించిన సీతక్క
- ఆయా సంస్థలతో కలిసి బాధితులకు పంపిణీ చేసిన వైనం
- సహాయం చేయని వారికి సంతృప్తి దక్కబోదంటూ కామెంట్
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని చాలా ప్రాంతాలు... ప్రత్యేకించి గోదావరి పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాలకు చెందిన బాధితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు చేరారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో వారంతా తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మహిళా నేత, ములుగు ఎమ్మెల్యే దనసిరి అనసూయ అలియాస్ సీతక్క వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో మునిగిపోయారు.
వరద బాధితుల సహాయం కోసం వివిధ సంస్థల నుంచి నిత్యావసరాలు సేకరించిన సీతక్క... ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. వరద బాధితులకు తన వెంట తీసుకెళ్లిన దుప్పట్లు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీతక్క... దానికి సుదీర్ఘ కామెంట్‌ను కూడా జత చేశారు.
మీరెంత సహాయం చేసినా సంతృప్తి కలగకపోవచ్చు కానీ... ఏ సహాయం చేయకుంటే మాత్రం సంతృప్తి అన్నదే దక్కదు అంటూ ఆమె పేర్కొన్నారు. తన పిలుపునకు స్పందించి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆయా సంస్థలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.