చెస్ బోర్డు ముందు తలైవా... చెన్నై ఒలింపియాడ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్
- నేటి నుంచి చెస్ ఒలింపియాడ్
- చెన్నైలో ప్రారంభోత్సవం
- మహాబలిపురంలో పోటీలు
- చెస్ మేధావులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలన్న రజనీ
భారత్ లో మరో క్రీడోత్సవానికి తెరలేవనుంది. నేటి నుంచి తమిళనాడులో చెన్నై ఒలింపియాడ్ నిర్వహించనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం చెన్నైలో జరగనుండగా, పోటీలు మాత్రం మహాబలిపురంలో నిర్వహిస్తారు. 188 దేశాల నుంచి క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చెస్ ఒలింపియాడ్ పై స్పందించారు. ఇండోర్ గేమ్ అయిన చెస్ ఒలింపియాడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఈ చదరంగ క్రీడోత్సవంలో పాల్గొంటున్న చెస్ మేధావులందరూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు. వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని తలైవా ట్వీట్ చేశారు. ఈ మేరకు తాను చెస్ ఆడుతున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరుకానున్నారు. ఆగస్టు 10 వరకు ఈ పోటీలు జరుగుతాయి.