జొమాటోకు కొత్త విలువ కట్టిన అశ్వథ్ దామోదరన్
- ఒక్కో షేరుకు మధ్యస్థ విలువ రూ.34.12
- మరికొన్ని వారాల్లో రావచ్చని దామోదరన్ అంచనా
- ఆ ధరకు వస్తే కొనుగోలు చేస్తానని ప్రకటన
జొమాటో ఒక షేరు విలువ రూ.41. వ్యాల్యూషన్ గురువుగా సుపరిచితుడైన అశ్వథ్ దామోదరన్ జొమాటో ఐపీవో సమయంలోనే చెప్పిన మాట. న్యూయార్క్ లోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారాయన. జొమాటోకు రూ.41 విలువ చెప్పినప్పుడు ఆయన్ను ఎందరో విమర్శించారు. తిట్టిన వారు, విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ.76. లిస్ట్ అయింది రూ.115 వద్ద. అక్కడి నుంచి రూ.179కు దూసుకుపోయింది.
దీంతో అంత తక్కువ ధర కట్టినందుకు ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరిగ్గా ఏడాది తర్వాత జొమాటో షేరు ధర దామోదరన్ చెప్పిన స్థాయికి దిగొచ్చింది. ప్రస్తుతం జొమాటో షేరు ధర రూ.46 స్థాయిలో ఉంది. ఈ తరుణంలో గతంలో తాను చెప్పినట్టు ఒక్కో షేరు సహేతుక విలువ రూ.41ని దామోదరన్ ఇంకా తగ్గించారు. దానిని రూ.35.32గా సవరించారు. మరికొన్ని వారాల్లో ఈ షేరు మధ్యస్థ విలువ అయిన రూ.34.12కు దిగొస్తుందని, అదే జరిగితే తాను కొనుగోలు చేస్తానని ప్రకటించారు.