గుడివాడ నుంచి 15 ఏళ్ల బాలుడితో పరారైన నలుగురు పిల్లల తల్లి.. హైదరాబాద్‌లో సహజీవనం

గుడివాడ నుంచి 15 ఏళ్ల బాలుడితో పరారైన నలుగురు పిల్లల తల్లి.. హైదరాబాద్‌లో సహజీవనం
  • బాలుడికి నీలి చిత్రాలు చూపించి లోబర్చుకున్న వివాహిత
  • శారీరక సంబంధం బయటపడుతుందని బాలుడితో కలిసి హైదరాబాద్‌కు
  • బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • ఎదురింట్లో ఉండే వివాహితే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు నిర్ధారణ
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ వివాహిత (30) అదృశ్యం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొరుగింట్లో ఉండే 15 ఏళ్ల బాలుడితో కలిసి హైదరాబాద్ పరారైన ఆమె అక్కడ అతడితో సహజీవనం చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడలోని గుడ్‌మన్‌పేటకు చెందిన వివాహిత నలుగురు పిల్లల తల్లి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న 15 ఏళ్ల బాలుడితో చనువుగా ఉండడం ప్రారంభించింది.

బాలుడికి ఫోన్‌లో నీలిచిత్రాలు చూపిస్తూ అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. నెల రోజులపాటు రహస్యంగా సాగిన ఈ వ్యవహారం బయటకు పొక్కితే బాలుడు తనకు దూరమవుతాడని భయపడింది. దీంతో ఈ నెల 19న బాలుడిని తీసుకుని హైదరాబాద్ చేరుకుంది. బాలానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరూ అక్కడ సహజీవనం ప్రారంభించారు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎదురింట్లో ఉండే వివాహితే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు నిర్ధారించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి ఇద్దరినీ గుడివాడకు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


More Telugu News