తెలంగాణలో కొత్తగా 852 కరోనా కేసుల నమోదు

  • మొత్తం 36,764 మందికి పరీక్షలు  
  • హైదరాబాద్ లో 358 మందికి పాజిటివ్  
  • కోలుకున్న వారు 640 మంది 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. మంగళవారం వరకు ఎనిమిది వందలోపే రోజువారీ కేసులు నమోదు కాగా.. బుధవారం ఈ సంఖ్య దాటిపోయింది. గత 24 గంటల్లో 36,764 మందికి పరీక్షలు చేయగా.. 852 కోవిడ్ కేసులు నమోదయ్యాయంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గతంలో కోవిడ్ సోకి యాక్టివ్ కేసులుగా ఉన్నవారిలో 640 మంది కోలుకున్నారని ప్రకటించింది.
  • మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 8,16,531 కి చేరిందని.. అందులో ఇప్పటివరకు 8,07,505 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రికవరీ రేటు 98.89 శాతంగా ఉందని వివరించింది.
  • గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఎలాంటి మరణాలూ సంభవించలేదని.. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,111గా ఉందని తెలిపింది. 
  • తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 358 మందికి పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించింది. తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 63, రంగారెడ్డి జిల్లాలో 57 కేసులు నమోదైనట్టు తెలిపింది.
  • జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది.


More Telugu News