రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు... ఆయనకు కాంగ్రెస్, సోనియాపై అభిమానం ఉంది: భట్టి విక్రమార్క
- రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి భట్టి
- రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి చర్చలు
- కేసీ వేణుగోపాల్‌లో భట్టి బృందం సమాలోచనలు
- త్వరలోనే పార్టీలో భారీ చేరికలుంటాయని ప్రకటన
- బండి సంజయ్ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్న విక్రమార్క
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని భావిస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బుధవారం ఢిల్లీ వచ్చిన భట్టి... పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బుధవారం రాత్రి వేణుగోపాల్ ఇంటి వద్దే ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్నా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నా రాజగోపాల్ రెడ్డికి అభిమానం ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని వీడి రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్లరని భావిస్తున్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డిలో ఏదైనా అసంతృప్తి ఉంటే... చర్చల ద్వారా అసంతృప్తిని దూరం చేస్తామని, ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ చర్యల ద్వారా రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడిన భట్టి... బండి సంజయ్‌కు రాజకీయ అవగాహనే లేదని విమర్శించారు. బండి సంజయ్ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.