వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న కేటీఆర్.. వీడియో ఇదిగో!

  • కాలి గాయంతో ఇంట్లో ఉన్న కేటీఆర్
  • ప్రగతి భవన్ నుంచి వరదలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
  • ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశం
కాలి గాయంతో బాధపడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలకశాఖ అధికారులు హాజరయ్యారు. 

ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు కేటీఆర్ సూచించారు. వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని... పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. సాగునీటి వనరులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News