ఈడీ అరెస్టులు ఏకపక్షం కాదు!.. చిదంబరం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- ఈడీ చర్యలన్నీ సమర్థనీయమైనవేనన్న సుప్రీంకోర్టు
- నిందితులకు ఈసీఐఆర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడి
- అరెస్ట్ సందర్భంగా ఫిర్యాదు వివరాలు చెబితే సరిపోతుందన్న ధర్మాసనం
- బెయిల్ రాకుండా ఈడీ చెప్పే కారణాలూ సమర్థనీయమైనవేనని స్పష్టీకరణ
మనీ ల్యాండరింగ్ కేసుల పేరిట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిబంధనలను అతిక్రమిస్తూ నిందితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. ఈడీ అధికారులు చేపడుతున్న చర్యలు ఏకపక్షమేమీ కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనీ ల్యాండరింగ్ కేసుల్లో సోదాలు చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లాంటి అధికారాలు ఈడీకి ఉన్నాయని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈడీ చర్యలను సమర్థించిన సుప్రీంకోర్టు...మనీ ల్యాండరింగ్ చట్టంలోని ప్రొవిజన్లను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
మనీ ల్యాండరింగ్ కేసుల విచారణలో ఈడీ అధికారులను నిలువరించాలంటూ చిదంబరంతో పాటు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణను పూర్తి చేయగా... తాజాగా బుధవారం ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది. మనీ ల్యాండరింగ్ చట్టంలోని ప్రొవిజన్లన్నీ సమర్థనీయమైనవేనని కోర్టు స్పష్టం చేసింది. ఈడీతో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఏ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లకు చెందిన అధికారులు పోలీసులు కాదన్న కోర్టు... విచారణ సమయంలో ఆయా విభాగాల అధికారులు రికార్డ్ చేసే వాంగ్మూలాలను చట్టబద్ధమైన సాక్ష్యాలుగానే పరిగణించవచ్చని తెలిపింది.
ఇక మనీ ల్యాండరింగ్ కేసుల విచారణ సందర్భంగా ఈడీ లాంటి సంస్థల అధికారులు నిందితులకు ప్రతిసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అధికారులు ఫిర్యాదు వివరాలను చెబితే సరిపోతుందని కూడా కోర్టు పేర్కొంది. ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కాదన్న కోర్టు... నిందితుల బెయిల్‌ను తిరస్కరించే దిశగా ఈడీ అధికారులు చెప్పే రెండు కఠినమైన షరతులు కూడా చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.